సిరాన్యూస్, కళ్యాణదుర్గం
ఆటో డ్రైవర్లకు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి: డీఎస్పీ రవి బాబు
ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని డీఎస్పీ రవి బాబు అన్నారు. బుధవారం కళ్యాణదుర్గం పట్టణంలో స్దానిక పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో పట్టణంలోని ఆటో డ్రైవర్లకు డీఎస్పీ రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈసందర్బంగా డీఎస్పీ ప్రధానంగా పట్టణంలో ఆటో నడుపుకుంటున్న వారు తప్పనిసరిగా లైసెన్స్ పొంది ఉండాలన్నారు .ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఆటో నడపాలని, ఆటోకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకటరమణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.