సిరాన్యూస్, ఓదెల
విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ అని చెప్పండి : విశ్వబ్రాహ్మణ గ్రామ మాజీ అధ్యక్షులు నాగవెల్లి సంతోష్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కుల గణన సర్వేలో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మలు నమోదు చేయించుకోవాలని విశ్వబ్రాహ్మణ గ్రామ మాజీ అధ్యక్షులు నాగవెల్లి సంతోష్ అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వబ్రాహ్మణ కుల బంధువులందరూ మీ ఇంటి వద్దకు వచ్చిన కుల గణన ఆఫీసర్స్ కు మీరు చెప్పవలసింది (విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ) కులమని చెప్పాలని తెలిపారు. మన యొక్క ఉప కులాల పేర్లు కమ్మరం, వడ్రంగి, కంచరి, శిలా శిల్పి అవుసుల అని ఉప కులాల పేర్లు చెప్పకండి విశ్వబ్రాహ్మణలు అని చెప్పాలని తెలిపారు.ఈమంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఓదెల మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నాగవెల్లి ఈశ్వర్, పెద్దపల్లి జిల్లా కోశాధికారి నాగవెల్లి శ్రీమన్నారాయణ , నాగుల మల్యాల రమేష్ చారి, లక్ష్మణాచారి తదితరులు ఉన్నారు.