షవర్మ తిని అనారోగ్యం పాలు

 సిరా న్యూస్,రంగారెడ్డి;
మేడ్చల్ జిల్లాలో షవర్మ తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు. లోతుకుంట గ్రీన్ హౌస్ లో షవర్మ తిన్న వారు అస్వస్థతకు గురయ్యారు. షవర్మ తిన్న కొన్ని గంటల్లోనే వాంతులు, విరేచనాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, గ్రిల్ హౌస్ లో ఇటీవల షవర్మ తిన్న వారు కూడా అస్వస్థతకు గురి కావడంతో.. అధికారులు రంగంలోకి దిగారు. గ్రిల్ హౌస్ ను తాత్కాలికంగా మూసివేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ఫుడ్ కు సంబంధించిన అంశంలో ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. చాలా హోటల్స్ లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కిచెన్ లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. కిచెన్ లో ఎలుకలు, బొద్దింకలు తిరుగుతున్నాయి. ఎక్స్ పైరీ అయిన ఆహార పదార్ధాలు, కుళ్లిన కూరగాయలతోనే వంటకాలు చేసి కస్టమర్లకు పెడుతున్నారు. ఇవి తిన్న కస్టమర్లు అనారోగ్యం బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో పరిస్థితి విషమించి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.తాజాగా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే లోతుకుంటలోని గ్రిల్ హౌస్ షవర్మాలో ఫుడ్ తినడం వల్ల అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు. నెల రోజుల క్రితం కూడా గ్రిల్ హౌస్ కు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. దాంతో నిర్వాహకులు కొన్ని రోజుల పాటు మూసివేశారు. ఆ తర్వాత ఓపెన్ చేశారు. ఆ తర్వాత అక్కడ తిన్న వారు కూడా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. దీంతో స్పందించిన అధికారులు గ్రిల్ హౌస్ కు తాళాలు వేశారు.కాగా, ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ తరహా ఘటనలు తరుచుగా వెలుగు చూస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహాకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, పరిశుభ్రత పాటించడం లేదని అంటున్నారు. ఆహారం తయారు చేసే ప్రాంతం అపరిశుభ్రంగా ఉన్నా, కల్తీ ఆహార పదార్ధాలు వినియోగిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *