సిరా న్యూస్,అదిలాబాద్;
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్సీగా ఎంపికైన కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి పదవీకాలం పూర్తి కానుంది. ఆ స్థానంలో కొత్తవారిని ఎన్నుకునేందుకు వీలుగా ఎన్నికలు నిర్వహించనుంది. ఎన్నికల కసరత్తును ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ప్రారంభించింది. ఓటర్ల జాబితా కోసం ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. డిసెంబర్ 12న ఓటర్ల తుది జాబితా ప్రచురించనున్నారు.నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి 2025 మార్చి నెలలో ఎమ్మెల్సీ పదవి కాలం ముగుస్తున్న నేపధ్యంలో ఇప్పటినుంచే తమ ప్రచారాలు ప్రారంభించారు. అయితే ఈసారి జరగబోయే పట్టభద్రుల ఎన్నికలు గతంలో కంటే అధిక పోటీ ఇచ్చేందుకు అన్ని రంగాల వారు సిద్ధమవుతున్నారు. ముందస్తు కసరత్తు ప్రారంభించారు.
ప్రముఖ వ్యాపారవేత్త ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వుట్కూరి నరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ, ప్రముఖ వైద్యుడు మాజీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బి.ఎన్.రావు, కరీంనగర్ మాజీ మేయర్ సివిల్ సప్లై చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, డాక్టర్ చంద్రశేఖర్, కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు కొలసాని సుగుణాకర్ రావు, ట్రస్మ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తికరంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో ఈసారి గట్టి పోటీ ఇచ్చేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రచారాలను ప్రారంభించారు.ప్రధాన పార్టీల విషయాలకు వస్తే బిఆర్‌ఎస్ పార్టీ నుంచి మాజీ సివిల్ సప్లై చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ బీజేపీ నుంచి జాతీయ కిసాన్ మోర్చా అధ్యక్షుడు సుగుణాకర్‌రావుకు ఛాన్స్ ఉందని తెలుస్తోంది. పార్టీ నుంచి కూడా వారికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. కాంగ్రెస్‌లో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన ప్రొఫెసర్ ప్రసన్న హరి కిషోర్‌కి లేక సొంత సామాజిక వర్గానికి చెందిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా? లేదా ఇంకా వేరే వాళ్లకు ఛాన్స్ ఇస్తారా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకం. అయితే జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో ఇద్దరు బిసి సామాజిక వర్గానికి చెందిన వారు మరో ఇద్దరు ఓసి సామాజిక వర్గానికి చెందినవారు పోటీల్లో నిలవడం ఆసక్తికరంగా మారింది.గతంలో పట్టబదుల పక్షాన నాయకులు పోరాడిన న్యాయం జరగలేదని ఒక అసంతృప్తి పట్టభద్రుల్లో నెలకొంది. అయితే ఈసారి అలా కాకుండా పట్టభద్రుల పక్షాన ఉండి తమ సమస్యలపై పోరాడే వాళ్లను ఎన్నుకోవాలని పట్టభద్రులు ఆలోచిస్తున్నారు. కానీ ఈసారి జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో ఓటర్లకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఎవరికి ఓటు వేయాలి అనే ఒక ప్రశ్న ఓటర్లలో చిన్న ఆందోళన తీసుకువచ్చింది.ప్రముఖ అపరవేత్త ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ఉత్కూరి నరేందర్ రెడ్డికి ఓటు వేయాల లేక మాజీ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ బి.ఎన్.రావుకు గెలిపిద్దామా లేక బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణను ఎన్నుకుందామా అనే అనే సందిగ్ధంలో ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుంది.ఆల్ఫోర్స్ విద్య సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి కొంతవరకు వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మాజీ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ బి.ఎన్.రావు తన సామాజిక సేవ భావంతో ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రొఫెసర్‌గా అనుభవం కలిగిన ప్రసన్న హరికృష్ణ విద్యార్థుల్లో మంచి పేరున్న వ్యక్తిగా తెలుస్తుంది. బిఅర్ఎస్ పార్టీ నాయకుడు సర్దార్ రవీందర్ సింగ్ న్యాయవాదిగా అనుభవంతోపాటు కరీంనగర్ మేయర్‌గా అనుభవం కలిగిన వారు.వైద్యరంగంలో రాణిస్తున్న డాక్టర్ బి.ఎన్.రావు, న్యాయవాదిగా అనుభవం కలిగిన సర్దార్ రవీందర్ సింగ్, విద్యారంగంలో అనుభవం కలిగిన ప్రొఫెసర్ ప్రసన్న హరి కిషోర్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. వీరిలో ఎవరికి టికెట్ వస్తుంది పట్టభద్రుడి అభిమానాన్ని ఎవరు గెలుచుకుంటారనేది మాత్రం ఆసక్తిగా మారింది.