– జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
సిరా న్యూస్,పెద్దపల్లి ప్రతినిధి:
జిల్లాలో ఉన్న ప్రతి గర్భిణి మహిళకు సంపూర్ణమైన వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రులలో సమర్థవంతం గా అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో గర్భిణీ మహిళలకు అందే వైద్య సేవల పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్భిణీల నమోదు తక్కువగా ఉందని, వారు పరిశీలించుకు ని ప్రతి గర్భిణీ స్త్రీ 100% రిజిస్టర్ అయ్యేలా చూడాలని, గర్భిణీ స్త్రీలు నమోదు కొరకు ఎల్.ఎం.పి లిస్ట్, నవ దంపతుల లిస్ట్ ప్రిపేర్ చేసి వారిని ట్రాక్ చేయాలని కలెక్టర్ సూచించారు. గర్భిణీ మహిళల జాబితా ప్రతి సూపర్వైజర్ వద్ద ఉండాలని, గర్భిణీ స్త్రీలను సూపర్ వైజర్ మానిటరింగ్ చేయాలని, బర్త్ ప్లాన్ రూపొందించుకొని ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీ జరిగేలా చర్యలు తీసుకోవాలని, కనీసం 80 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో జరగాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న 102 వాహనాలను ఉపయోగించు కొని గర్భిణీ స్త్రీలను పరీక్షలకు పంపాలని, ఏ రోజు ఏ గర్భిణి మహిళలను పరీక్షలకు తీసుకు రావాలో జాబితా తయారు చేసుకోవాలని, ఆ జాబితా ప్రకారం గర్భిణీ స్త్రీలకు తగు పరీక్షలు నిర్వహించుటకు మాత శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం నందు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు.
ఎం.ఎల్.హెచ్.పి, హై రిస్క్ గర్భిణి కేసులను నెల ముందుగానే ఫాలో అప్ చేస్తూ అవసరమైన సమయంలో వెంటనే 108 వాహనంలో మాత శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి తరలించేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. పెద్దపల్లిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీ డెలివరీ అయిన వారికి ప్రత్యేక ఏసీ రూములు రూసుము చెల్లించేవి ఉన్నాయని, అవసరమైన వారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. విధి నిర్వహణలో సూపర్వైజర్లు సమయపాలన పాటించాలని, ఫీల్డ్ యందు డ్యూటీ సమయం ముగిసే వరకు ఉండాలని, సీనియర్ సూపర్వైజర్లు కూడా మెడికల్ అధికారి సూచనలు పాటించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఆరోగ్య కేంద్రం నందు అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రణాళిక రూపొందించి అవసరమైన పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ఫీవర్ సర్వేలో ఎక్కువ జ్వరాలు నమోదైన గ్రామాలలో పంచాయతీ కార్యదర్శి సహకారంతో ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, వైరల్ జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, జిల్లా ఆసుపత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ శ్రీధర్, ఎడిపిహెచ్ఓ డాక్టర్ అన్న ప్రసన్న, ప్రోగ్రాం అధికారి డాక్టర్ వాణిశ్రీ, సూపర్వైజర్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.