సిరాన్యూస్, పెద్దపల్లి
పేద ఆడబిడ్డ పెండ్లికి అండగా ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఇద్దులపూర్ గ్రామంలో నివాసముంటున్న పేద కుటుంబానికి చెందిన దాసరి సత్తెమ్మ – కీ” శే” మల్లేష్ ల కూతురు లికిత వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు అండగా నిలించింది. ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ బియ్యం ,పెండ్లి కూతురు లికిత కు పెండ్లి చీర అందజేశారు.అనంతరం ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు పెద్దపల్లి నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు పలు సేవకార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధం వైకుంఠం, దండవేణి రమేష్, హారికట్ల లక్ష్మణ్, నల్ల కేశవరెడ్డి, తోట శ్రీధర్, సిద్ధం శ్రీనివాస్,కంది రాములు,కెక్కర్ల అజాయ్, పెట్టం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.