సిరా న్యూస్,హైదరాబాద్;
మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి మరణం పట్ల రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. మెట్ పల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ అడ్వకేట్ కొమిరెడ్డి రాములు సతీమణి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొమిరెడ్డి జ్యోతి అనారోగ్యంతో బెంగళూరులోని ఒక హాస్పిటల్ లో మృతి చెందగా, మంత్రి సురేఖ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
కొమిరెడ్డి జ్యోతి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని… వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.