జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
జిల్లా కేంద్రంలో ఉత్సాహభరితంగా కొనసాగిన 2కె రన్
ఉత్సాహకంగా పాల్గొన్న పోలీస్ అధికారులు,సిబ్బంది విద్యార్థిని, విద్యార్థులు,వాకర్స్.పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణం బతుకమ్మ ఘాట్ నుండి గాంధీ,అంబేద్కర్ చౌరస్తా మీదుగా బతుకమ్మ ఘాట్ వరకు 2కె రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.
ప్రజా క్షేమం కోసం పని చేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం వివిధ కార్యక్రమలు చెపడుతున్నామని,అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ వారి ఆశయ సాధన కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని, ప్రజా రక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని చెప్పారు.ప్రతీ ఒక్కరి ఆరోగ్య రక్షణకు వ్యాయామం చేయడం ముఖ్యమని, మానసికంగా,శారీరకంగా దృఢంగా ఉండడానికి వాకింగ్,వ్యాయామం,యోగ ప్రతి నిత్యం చేయాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని, శారీరక దారుఢ్యం పెరుగుతుందన్నారు.యువత చెడు మార్గాల వైపు మరలకుండా చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని సూచించారు.అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన 2కె రన్ లో ప్రజలు, విద్యార్థులు భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు.
2కె రన్ లో అందరితో పాటుగా పాల్గొని పూర్తి చేసిన ఇద్దరు మహిళలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి వారికి అందరూ ఆదర్శంగా తీసుకోవలన్నారు.
ఈ కార్యక్రమంలో అధనవు ఎస్పీ చంద్రయ్య, సిఐ లు కృష్ణ, వెంకటేశ్వర్లు, ఆర్ఐ లు యాదగిరి, రమేష్, ఎస్సై లు,పోలీస్ సిబ్బంది, మెడికల్ కాలేజ్ విద్యార్థులు, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, పాలిటెక్నిక్ విద్యార్థులు, పట్టణ యువత వాకర్స్ పాల్గొన్నారు.