మోమోస్ తిని ఒకరు మృతి

పలువురికి అనారోగ్యం
సిరా న్యూస్,హైదరాబాద్;
మోమోస్ తిని ఒకరు మృతి చెందాడమే కాకుండా దాదాపు 50 మంది ఆసుపత్రి పాలైన సంఘటన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం… బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నంది నగర్, సింగాడి బస్తి, గౌరీ శంకర్ కాలని లో శుక్రవారం జరిగిన సంతల్లో మొమోస్ విక్రయించారు. సింగాడ కుంట బస్తికి చెందిన రేష్మ బేగం(31) తో పాటు ఆమె పిల్లలు మోమొస్ తిన్నారు. వీరితో పాటు ఆయా బస్తీల్లో ని దాదాపు 50 మందికి పైగా వీటిని తిన్నారు. వీరందరికీ శనివారం నుంచి వాంతులు, విరేచనాలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే వీరంతా బంజారా హిల్స్ చుట్టూ పక్కల ప్రాంతాల్లో ఉన్న పలు ఆసుపత్రులలో చేరారు. వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు పది మందికి పైగా మైనర్లు ఉన్నారు. సింగారకుంట బస్తికి చెందిన రేష్మ బేగం ఆరోగ్య పరిస్థితి విషమించదంతో నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందింది. పవన్ కుమార్ తల్లి ఇద్దరు ఆస్పత్రిలో ఉన్నారు. ఈ సంఘటనపై ఇప్పటికే బాధితులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో మోమోస్ విక్రయించిన ఇద్దరినీ బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురి బాధితుల కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయిస్తున్నారు. మోమోస్ తో పాటు వాటిలోకి ఇచ్చే మయోనీజ్, మిర్చి చట్నీల కారణంగా ఈ సమస్య ఏర్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

2 thoughts on “మోమోస్ తిని ఒకరు మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *