సిరా న్యూస్,న్యూఢిల్లీ;
అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అమలాపురానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వీళ్లంతా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులుగా చెబుతున్నారు. రోడ్డు యాక్సిడెంట్‌లో పొన్నాడ సతీష్ బంధువులు నాగేశ్వరరావు, ఆయన భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ, ఆమెకు పుట్టిన ఇద్దరు పిల్లలు చనిపోయారు. గంగ భర్త లోకేష్ మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారు.