సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖ ఓల్డ్ టౌన్ లో కురుపాం మార్కెట్ ప్రాంతంలో గల 147 సంవత్సరాల పురాతన కన్య కాపరమేశ్వరి అమ్మవారి ఆలయం లో శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మ వారిని శ్రీమహాలక్ష్మి రూపంలో అలం కరణ చేసి భక్తులకు దర్శనం కలి గిం చినట్లు దేవస్థాన పురోహితులు తెలిపారు.తెల్లవారుజామున అమ్మ వారి మూలవిరాట్ కు పాలు, పెరు గు, గంధం, తేనె వంటి 108 రకాల ద్రవ్యములు మరియు వివిధ రకాల పండ్ల రసములతో ప్రత్యేక అభిషే కం చేసి అమ్మవారిని వివిధ రకాల పూలతో సుందరంగా శ్రీమహాలక్ష్మి రూపంలో అలంకరించి స్వర్ణ వస్త్రాలతో అలకరించి , 108 స్వర్ణపుష్పములతో నివేదన గావిం చారు.ఈ సందర్భంగా ఆలయ గర్భగుడిలో సుమారు ఆరు కేజీల స్వర్ణభరణములు, బంగారు చీర, బంగారు కిరీటం, బంగారు బిస్కెట్లు మరియు పది కేజీల వెండి వస్తువు లు వెండి బిస్కెట్లు తో పాటు నాలు గు కోట్ల విలువ చేసే భారతీయ కరెన్సీతో తీర్చి దిద్దారు.గర్భగుడి మొత్తం ధనాగారం గా మార్చివేసిన వైనం భక్తులను ఆకట్టుకుంది.గత 22 సంవత్సరముల నుంచి శరన్న వరాత్రి ఉత్సవాల సమయంలో అమ్మవారిని మహాలక్ష్మి అవతార రూపంలో కరెన్సీ నోట్లు, బంగారు మరియు వెండి ఆభరణాలతో అలంకరణ చేయడం జరుగుతుం దని పురోహితులు చెపుతున్నారు.