Kalyandurgam Model School: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం… ఎమ్మెల్యేను ఆశ్రయించిన బాధితులు

సిరాన్యూస్‌, క‌ళ్యాణదుర్గం
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం ఎమ్మెల్యేను ఆశ్రయించిన బాధితులు
* న్యాయం చేయాల‌ని వేడుకోలు

కళ్యాణదుర్గం మోడల్ పాఠశాలలో ఒప్పంద ఉద్యోగులు ఇస్తామని నమ్మబ‌లికి ఒక్కొక్కరి నుండి రూ.3.5 నుండి 4 లక్షల రూపాయలు మదనపల్లికి చెందిన మమత, శ్రీకాకుళం అనిత, విజయవాడ నుండి అవినాష్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డిలు వ‌సూలు చేశార‌ని నిరుద్యోగ బాధితులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును బాధితులు క‌లిసి త‌మ బాధ‌ను చెప్పుకున్నారు. సంద‌ర్బంగా వారు మాట్లాడుతూ మా వ‌ద్ద నుంచి డ‌బ్బులు వ‌సూలు చేసిన వారంద‌రూసజ్జల రామకృష్ణారెడ్డి అనుచరులే తెలిపారు. సంవ‌త్స‌రం నుంచి వారి చుట్టూ తిరుగుతున్నా ఉద్యోగాలు ఇప్పించ‌లేద‌ని, డ‌బ్బులు తిరిగి ఇవ్వ‌లేద‌ని వాపోయారు. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన మాకు న్యాయం జరగలేదని చెప్పారు. మా భార్యల తాళి తో సహా తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చామ‌ని కొందరు విలపించారు.వారి గోడు విన్న ఎమ్మెల్యే స్పందిస్తూ ఈశ్వర్ రెడ్డి అనే వ్య‌క్తితో చరవాణిలో మాట్లాడి వారి డబ్బులు తిరిగి ఇచ్చేలా చూడాలని, లేని పక్షంలో పోలీసు కేసులు నమోదుకు వెనకడమని తెలిపారు. దీనిపై విచారణ చేసి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.అడిగిన వెంటనే స్పందించి ఎమ్మెల్యే కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో గోపి, గంగాధర, వన్నూరుస్వామి,ఎ్వర్రిస్వామి, షాహీద, తిమ్మారెడ్డి, రమేష్, లక్ష్మణమూర్తి, తిప్పేస్వామి, అంజమ్మ, దసప్ప లు ఉన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *