సిరాన్యూస్, చిగురుమామిడి
బ్యాంక్ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి: ఫీల్డ్ ఆఫీసర్ అనిల్ రెడ్డి
కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చిగురుమామిడి ఫీల్డ్ ఆఫీసర్ అనిల్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత నగదు రహిత లావాదేవీలు అనే అంశంపైన అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహాకార బ్యాంక్ ఆధ్వర్యంలో పాడి పశువుల పెంపకం, గొర్రెల పెంపకం, ట్రాక్టర్ హార్వెస్టర్ జెసిపి, బోర్వెల్, ల్యాండ్ లెవెలింగ్, గృహ నిర్మాణం, కోళ్ల పెంపకం, ఎడ్యుకేషన్ లోన్స్, గోల్డ్ లోన్స్, ఎస్ఎస్జి లోన్స్ భూమి మాడిగేషన్ ద్వార అందించడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లల భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో స్టాఫ్ అసిస్టెంట్ రజిత, రాం మూర్తి,సదానందం, కత్తుల ప్రవీణ్, కత్తుల మొండయ్య, కొంకట రవి ,మామిడి బాలయ్య గ్రామ రైతుకు పాల్గొన్నారు.