ములకలచెరువు
సిరా న్యూస్,అన్నమయ్య;
అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ములకలచెరువు బస్టాండు కూడలిలో ఆర్టీసీ బస్సు ఢీకొని రైతు దుర్మరణం చెందిన విషాదకర సంఘటన శుక్రవారం ఉదయం ఏడు గంటలకు జరిగింది. ఘటనపై సీఐ రాజారమేష్ తెలిపిన వివరాలు. మండలంలోని గుట్టకిందపల్లెకు చెందిన నరసింహులు కొడుకు రైతు శంకరప్ప(54), సొంతపని మీద ములకలచెరువుకు వచ్చాడు. బస్టాండ్ లో రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి శంకరప్పను ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితున్ని 108లో జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు