సరూర్ నగర్ చెరుకు తోట కాలనీ కి చెందిన దళితుల ఆందోళన
సిరా న్యూస్,హైదరాబాద్;
బుధవారం రాత్రి గణేష్ నిమజ్జనం సందర్బంగా వినాయక నిమజ్జనం చేయడానికి వెళ్తున్న భక్తులపై మన్సురా బాధ్ డివిజన్ బీఆర్ఎసక్ నేత జక్కిడి రఘువీర్ రెడ్డి, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు . ఈ దాడిలో స్వరూప రాణి అనే మహిళకు గాయాలయ్యాయి.మహిళలు అని కుడా చూడకుండా భౌతిక దాడులకు దిగడం జరిగిందని, తక్షణమే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర మాల మహానాడు నేత బేర బాలకిషన్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ పోలీసు స్టేషన్ లో బైఠాయించారు.