సిరా న్యూస్,వికారాబాద్;
ఫార్మాకంపెనీలను ఏర్పాటు చేయరాదని డిమాండ్ చేస్తూ, .రైతులకు అండగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మహా పాదయాత్ర ప్రారంభించారు. కార్యక్రమానికి మద్దతుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు వచ్చారు. వారిని పోలీసులు బొంరాస్ పెట్ మండలం,తుంకి మెట్ల లో అడ్డుకున్నారు. అరెస్టు చేసి పర్గి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపధ్యంలో ఇరు వర్గాలకు తీవ్ర వాగ్వాదం నెలకొంది.