సిరా న్యూస్,ఇంద్రకీలాద్రి;
దసరా ఉత్సవాల్లో ఏడవ రోజు, మూలా నక్షత్రం సందర్బంగా సరస్వతీ దేవి రూపములో కనకదుర్గమ్మ అమ్మవారు దర్శనమిచ్చారు. బుధవారం తెల్లవారుజామునే అమ్మవారి దర్శనం ప్రారంభమయింది. భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గగుడి అంతరాయలం వద్ద పోలీసులు భక్తులు పట్ల దురుసుగా ప్రవర్తిం చారని పలువురు ఆరోపించారు. వివరణ అడిగితే మాపై దాడి చేశారని మహిళ భక్తురాలు అవేదన వ్య క్తం చేసింది. మగ పోలీసులు భక్తులు పట్ల మర్యాదగా ప్రవర్తిస్తుంటే మహిళ పోలీసులు దిగి జారి మాట్లాడుతున్నారని మహిళా భక్తురాలు ఆరోపించింది