సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి జిల్లాలో గజరాజుల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం రాత్రి చిన్నగొట్టిగల్లు మండలంలోకి 17 ఏనుగుల గుంపు ప్రవేశించింది. ఒక్కసారి ఏనుగుల గుంపు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు