ఇందిరాపార్కు వద్ద నిరసన
అందోళనను అడ్డుకునేందుకు అంక్షలు
అయినా పోరాడుతాం: యూనియన్లు
సిరా న్యూస్,హైదరాబాద్;
తమ సమస్యల పరిష్కారం కోసం హోంగార్డులు ఆందోళనలకు సిద్ధమయ్యారు. డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నేడు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సన్నద్ధమయ్యారు. ప్రతిపక్షంలో ఉండగా తమకు అనేక హామీలిచ్చి ఊరించిన కాంగ్రెస్ నేతలు, అధికారంలోకి వచ్చాక వినతి పత్రాలు కూడా తీసుకునేందుకు ముఖం చాటేస్తున్నారని మండిపడ్డారు. ఇతర ఉద్యోగ సంఘాలతో పాటు హోంగార్డులను కూడా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలిచి చర్చించాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఆందోళనలపై ఆంక్షలు ఉన్నా వెనక్కి తగ్గేది లేదని, శాంతియుతంగానే నిరసన తెలుపుతామని స్పష్టంచేశారు.