సిరాన్యూస్, సైదాపూర్:
గర్రెపల్లిలో స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి
* గ్రామపంచాయతీ కార్యదర్శి రాజీవ్‌కు గ్రామస్తుల వినతి
సైదాపూర్ మండలం గర్రెపల్లి గ్రామంలో పోచమ్మ గుడి వద్ద ఖాళీగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సోమారం గ్రామపంచాయతీ కార్యదర్శి రాజీవ్ కి గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు. గర్రెపల్లి గ్రామస్థులు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు ప్రతి సంవత్సరం ఖాళీ స్థానంలో బతుకమ్మ ఆడతారని, స్థలం ఆక్రమణకు గురికాకుండా ఉండాలంటే నూతనంగా నిర్మించబోయే గ్రామపంచాయతీ స్థలంలో ఖాళీ స్థలాన్ని కలపాలని కోరారు.