ఆర్వోబీ, ఫ్లై ఓవర్ ల పనులను పరిశీలించిన జీహెచ్ఎంసి కమిషనర్

సిరా న్యూస్,హైదరాబాద్;
యస్ అర్ డి పి అసంపూర్తిగా ఉన్న పెండింగ్ లో ఉన్న పనులను హెచ్ ఎం డి ఎ కమిషనర్ సర్ప రాజ్ అహ్మద్ తో కలిసి పలు పనులను జి హెచ్ ఎం సి కమిషనర్ ఇలంబర్తి పరిశీలించారు. ఫలక్ నామా ఆర్ వోబి, నల్గొండ x ఫ్లై ఓవర్, ఉప్పల్ ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు.
ఫలక్ నామా అర్ ఓ బి రైల్వే శాఖ చేపట్టాల్సిన పనులను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నల్గొండ x రోడ్డు ఫ్లై ఓవర్ ,ఉప్పల్ ఫ్లై ఓవర్ భూసేకరణ పెండింగ్ లో ఉన్నట్లు ప్రాజెక్టు ఇంజనీరింగ్ సి ఈ దేవానంద్ కమిషనర్ కు వివరించడం తో భూసేకరణ పనుల వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కమిషనర్ వెంట ప్రాజెక్టు సి ఈ దేవానంద్, ఎల్ బి నగర్, చార్మినార్ జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్ ,వెంకన్న ఎల్ బి నగర్ జోన్ ప్రాజెక్టు ఈ ఈ రోహిణి ఫలనుమా సంతోష్ నగర్, ఉప్పల్ డిప్యూటీ కమిషనర్లు అరుణ కుమారి, శైలజా, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *