సిరా న్యూస్,జగిత్యాల;
ధర్మపురి వద్ద గోదావరి నది ప్రవాహం కొనసాగుతుంది. గత రెండు రోజులుగా ఎగువ కురుస్తున్న వర్షాలతో శ్రీ రామ్ సాగర్, కడెం ప్రాజెక్టు లో ఇన్ఫ్లో భారీగా పెరగడంతో అట్టి వరద నీరును పలు గేట్ల ద్వారా గోదావరి నది లోకి వదిలారు దీంతో సోమవారం ధర్మపురి వద్ద నది ఉదృతి ఒక్క సారిగా పెరిగింది. ఉదయం వేళల్లో సంతోషి మాతా ఆలయం మెట్ల పైకి నీరు చేరుకోవడంతో పోలీస్,మున్సిపల్,దేవాదాయ శాఖల అధికారులు తీర ప్రాంత వాసులను అప్రమత్తం చేశారు. భక్తులను మెట్ల పై వరకే స్నానాలకు అనుమతించారు. దేవస్తాన మైక్ ల ద్వారా ఎప్పటికప్పుడు గోదావరి వరద పరిస్థితి పై అనౌన్స్ మెంట్ చేపట్టారు.