డిప్యూటీ తహసిల్దార్ శర్మకు ఎస్ఎఫ్ఐ నాయకులు వినతిపత్రం
సిరా న్యూస్,పిడుగురాళ్ల;
: విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి అని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు శనివారం పిడుగురాళ్ల మండల డిప్యూటీ తహసీల్దార్ శర్మకు వినతి పత్రం అందచేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కార్యదర్శి కోట సాయికుమార్ విలేకరులతో మాట్లాడుతూ, పెండింగ్లో ఉన్న 3,480 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలి అన్నారు .ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించాలి అన్నారు.ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టల్స్ మిస్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలి అన్నారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న మెస్ కాస్మోటిక్ చార్జర్ విడుదల చేయాలి అన్నారు.
శిధిల వ్యవస్థలో ఉన్న సంక్షేమ హాస్టల్స్ ను పునర్నిర్మాణం చేయాలి అన్నారు. సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి అన్నారు. జీవో నెంబర్ 77 రద్దు చేయాలి పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయం కల్పించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో
ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కన్వీనర్ కోటసాయికుమార్, పిడుగురాళ్ల మండల ప్రెసిడెంట్ రోహిత్, నాయకులు యాసిన్, బెనర్జీ, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.