సిరా న్యూస్,హైదరాబాద్;
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల జిల్లా చీరాల లో తెల్లవారుజాము నుండి కురుస్తున్న చెదురు ముదురు జల్లులకు రోడ్లు జలమయం కాగా పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.లోతట్టు ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేశారు.మరోవైపు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు.