సిరా న్యూస్,నల్లగొండ;
హైద్రాబాద్ టూ విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. దసరా పండగ నేపథ్యంలో జనం పట్నం నుంచి పల్లె బాట పడుతున్నారు. దాంతో -హైవేపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. దానికి తోడు చిట్యాల శివారులో రోడ్డుపై ఓ లారీ దగ్ధం అయింది. దాంతో -చిట్యాల నుంచి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. వాహనదారులు ట్రాఫిక్ జామ్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.