భారత అణుశక్తి పితామహుడు హోమి జహంగీర్ బాబా

-నేడు ఆయన జయంతి
సిరా న్యూస్;
బొంబాయి లో ఒక సంపన్న పార్సీ కుటుంబంలో జన్మించారు. బాబా భారతీయ కేంద్రక భౌతిక శాస్త్రవేత్త, వ్యవస్థాపక డైరక్టరు, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటాల్ రీసెర్చ్ లో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా పనిచేసాడు.అతనిని “భారత అణు కార్యక్రమానికి పితామహుడు” అని పిలుస్తారు. అతను భాభా అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్, ట్రోంబే కు వ్యవస్థాపక డైరెక్టర్‌. అతని గౌరవార్థం ఆ సంస్థకు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని పేరు పెట్టారు. భారత అభివృద్ధికి మూలస్తంభాలుగా ఉన్న టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటాల్ రీసెర్చ్, అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్, ట్రోంబే అణ్వాయుధాల సంస్థలకు అతను డైరెక్టర్‌గా పర్యవేక్షించాడు. అతనికి ఆడమ్స్ ప్రైజ్ (1942), పద్మభూషణ (1954) పురస్కారాలు లభించాయి. 1951, 1953–1956లలో అతను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి నామినేట్ చేయబడ్డాడు.
భాభా సాధారణంగా భారత అణుశక్తికి పితామహుడిగా గుర్తించబడ్డాడు. అంతేకాకుండా, యురేనియం నిల్వల కంటే దేశంలోని విస్తారంగా లభ్యమవుతున్న థోరియం నిల్వల నుండి శక్తిని వెలికి తీయడంపై దృష్టి సారించే వ్యూహాన్ని రూపొందించిన ఘనత ఆయనకు ఉంది. ఈ థోరియం కేంద్రీకృత వ్యూహం ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భిన్నంగా ఉంది. ఈ వ్యూహాత్మక లక్ష్యాన్ని సాధించడానికి భాభా ప్రతిపాదించిన విధానం భారతదేశం యొక్క మూడు దశల అణు విద్యుత్ కార్యక్రమంగా మారింది. 1966 జనవరి 24 న మోంట్ బ్లాంక్ సమీపంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 101 కూలిపోవడంతో హోమి జె. భాభా మరణించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *