కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ కు హుజురాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యుల వినతి

నివేశన స్థలాల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి

సిరా న్యూస్,హుజురాబాద్:

హుజురాబాద్ జర్నలిస్టులకు పంపిణీ చేసిన నివేశన స్థలాల సమస్యను పరిష్కరించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు హుజురాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులు శనివారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎల్ఎండి లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయనకు వినతి పత్రం అందించారు. గత రెండు రోజుల క్రితం ఇదే విషయమై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు సైతం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కో -కన్వీనర్లు కాయిత రాములు, నిమ్మటూరి సాయి కృష్ణ లు మాట్లాడుతూ.. నివేశన స్థాలాలకు సంబంధించి కోర్టు కేసు సమస్యను పరిష్కరించాలని, అలాగే ఈఎన్ సి సర్టిఫికెట్ ఇప్పించాలని కవ్వంపెల్లికి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించి హుజురాబాద్ జర్నలిస్టుల నివేశన స్థలాలకు సంబంధించి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల నివేశన స్థలాల విషయంలో సానుకూలంగా ఉందని తప్పకుండా తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నట్లు చెప్పారు. కవ్వంపల్లి ని కలిసిన వారిలో ప్రెస్ క్లబ్ ఆడహాక్ కమిటీ సభ్యులు వేల్పుల సునీల్ కుమార్, సభ్యులు పోతరాజు సంపత్ లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *