చదువుకు పేదరికం అడ్డుకాదు
మంచి చదువుకు చదువుకొని మీ తల్లీతండ్రుల గొప్ప పేరును తీసుకు రావాలి
పంచాయితీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
సిరా న్యూస్,ములుగు;
ఈ రోజు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనుల పరిశీలించడానికి వెళ్తున్న పంచాయితీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కి హైదరాబాద్ మనికొండ కు చెందిన ప్రభుత్వ పాఠశాల 10 వ తరగతివిద్యార్థులు విహారాయాత్రకు వెళుతూ కనిపించారు. వారంతా జై సీతక్క సమ్మక్క సారక్క మన అక్క సీతక్క అని కేరింతలు వేస్తూ ఉండటం మంత్రి బస్సులోకి వెళ్లి విద్యార్థులను ఆప్యాయంగాపలకరించారు. ఈ సందర్భంగా మంతరి మాట్లాడుతూ నేను పేద ఇంటి ఆడ బిడ్డను పేద కుటుంబం లో పుట్టిన నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవడం జరిగిందని పేదరికం చదువుకు అడ్డు కాదు మీతల్లీ తండ్రులు మీపైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి చదువులు చదువుకోవాలని విద్యార్థులకు సూచనలు చేశారు