ప్రాజెక్టు రన్ లో తెలంగాణ మంత్రులు

సిరా న్యూస్, హైదరాబాద్;
తెలంగాణ అసెంబ్లీని గత వారం ప్రాజెక్టులు, విద్యుత్, ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా కుదిపేశాయి. ముఖ్యంగా ప్రాజెక్టులపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేలాయి. ప్రాజెక్టుల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ప్రబుత్వం వాటిని నిగ్గు తేల్చేందుకు కమిటీలను కూడా వేసింది. కమిటీలతో ఆగిపోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని మంత్రులు నేరుగా ప్రాజెక్టులను సందర్శించబోతున్నారు. అక్కడి వాస్తవ పరిస్థితులు తెలుసుకోనున్నారు. ఇందులో బాగంగా ఈ నెల 29న మేడిగడ్డను మంత్రులు పరిశీలిస్తారు. సాగునీటి శాఖ, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో మంత్రి శ్రీధర్ బాబు మేడి గడ్డ ప్రాజెక్టును సందర్శిస్తారు.ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో మంత్రులు మెడిగడ్డ బయలుదేరుతారు. మెడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తారు. ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు చెప్పి వాటి నిర్మాణంతో జరిగిన లాభ, నష్టాలు వివరిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలు మీడియాకు తెలపనున్నారు ఇద్దరు మంత్రులు. ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్ అంశాన్ని కూడా పరిశీలించి తెలపనున్నారు. మెడిగడ్డ, సిందిళ్ళ, అన్నారం బ్యారేజ్ సమస్యలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై పవర్ పాయింట్ ప్రాజెక్టు అనంతరం మెడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌ను సందర్శించి పరిశీలిస్తారు. ఈ పర్యటనకు సంబంధించి నిర్మాణ సంస్థలకు సబ్ కాంట్రాక్టర్లలకు, ఈ నిర్మాణంలో సంబంధం ఉన్న వారిని కూడా ఆహ్వానించారు. ఇప్పటి వారికి సమాచారం ఇచ్చారు. మంత్రుల టూర్‌లో పాల్గొనాలని అన్ని వివరాలతో రావాలని సందేశం పంపించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *