సిరాన్యూస్, ఇచ్చోడ
ఇచ్చోడలో సివిల్ సప్లై హమాలీ కార్మికుల సంబరాలు
రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై హమాలీ కార్మికుల రేట్లను పెంచడం పట్ల ఏఐటీయుసీ జిల్లా సహాయ కార్యదర్శి కల్లేపల్లి గంగయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం స్థానిక మార్కెట్ యార్డులోని పౌర సరఫరాల గోడౌన్ వద్ద శనివారం ఏఐటియూసీ ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు స్వీట్లు పంచుకొని టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి కల్లేపల్లి గంగయ్య మాట్లాడుతూ సివిల్ సప్లై అధికారులతో సంఘం రాష్ట్ర నాయకత్వం జరిపిన చర్చల్లో హమాలీల సమస్యల పరిష్కారానికి అధికారులు హామీ ఇచ్చారని కల్లేపల్లి గంగయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో పౌరసరఫరాల గోడౌన్ కార్మికులు పాల్గొన్నారు.