సిరాన్యూస్, సామర్లకోట
సామర్లకోట ఎంపీడీఓగా కే. హిమా మహేశ్వరి
సామర్లకోట ఎంపీడీవో గా కే. హిమా మహేశ్వరి శనివారం ఉదయం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈమె అనపర్తి మండలం నుండి సామర్లకోట మండల ప్రజా పరిషత్ కు బదిలీ పైన వచ్చారు. ఈసందర్భంగా ఎంపీడీఓకు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి పలువురు అభినందనలు తెలిపారు. అనంతరం హిమా మహేశ్వరి మాట్లాడుతు తాను అనపర్తి మండలం నుండి సామర్లకోట వచ్చాను అని తనకు వృత్తి పరంగా అన్నివిధాలా కార్యాలయ సిబ్బంది సహకరించాలని కోరారు.