ఇండస్ట్రీ, సర్కార్ మధ్య గ్యాప్…

సిరా న్యూస్,హైదరాబాద్;
సినిమా ఇండస్ట్రీకి.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విడదీయరాని అనుబంధం ఉంది. కొంత మంది నటులు వివిధ పార్టీల తరఫున రాజకీయాల్లో ఉన్నారు. చాలా మంది పార్టీలకు అతీతంగా పాలకులకు సహకరిస్తూ.. పాలకుల సహకారం పొందుతూ వస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచే ఈ సంప్రదాయం కొనసాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇండస్ట్రీ వర్గాలు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు సహకారం అందిస్తున్నాయి. అయితే 2019 నుంచి 2024 వరకు ఏపీ సర్కార్‌ నుంచి తెలుగు ఇండస్ట్రీకి మద్దతు కరువైంది. దాని ఫలితం 2024లో వైసీపీ అధికారం కోల్పవడానికి ఇండస్ట్రీ కూడా పరోక్షంగా కారణమైంది. తెలంగాణలో గడిచిన పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ సర్కార్‌కు, ఇండస్ట్రీకి మద్య సత్సంబంధాలు కొనసాగాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. రెండ నెలల క్రితం వరకూ ఇండస్ట్రీ రేవంత్‌ సర్కార్‌కు అనుకూలంగానే ఉంది. కానీ హైడ్రా నాగార్జునకు చెందిన ఎన్‌కన్వెన్షన్‌ను కూల్చిన తర్వాత సర్కార్‌కు, ఇండస్ట్రీకి మధ్య గ్యాప్‌ పెరిగింది. నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ అక్రమమే అయినా పదేళ్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవమరించింది. రేవంత్‌ మాత్రం పెద్దలు, చిన్నతు, నేతలు, అధికారులు అనే తేడా లేకుండా ఆక్రమణలు కూల్చాలని హైడ్రాకు పవర్స్‌ ఇచ్చారు. దీంతో గత నెలలో నాగాజ్జున ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చింది.తాజాగా మంత్రి కొండా సురేఖ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌పై విమర్శలు చేసే క్రమంలో సినిమా ఇండస్ట్రీలోని మహిళా నటులతోపాటు సమంత, నాగచైన్య విడాకులకు కేటీఆర్‌ కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదంతో సంబంధం లేని నాగార్జున ఫ్యామిలీని ఇందులోకి లాగడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా మంత్రిపై తిరగబడింది. నాగార్జున ఫ్యామిలీతోపాటు సమంత, పలువురు హీరోలు, హీరోయిన్లు, నటీనటులు మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి కొండా సురేఖ దిగి వచ్చారు. తన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నట్లు తెలిపారు. తాను ఎవరినీ కించపర్చాలని ఈ వ్యాఖ్యలు చేయలేదని, కేటీఆర్‌ నైజం ఎండగట్టేందుకు మాత్రమే మాట్లాడానని తెలిపారు. అయినా ఇంకా ఇండస్ట్రీ నుంచి మంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయిమంత్రి కొండా సురేఖ చేసిన వాయఖ్యలపై హీరో నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. తన పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడిన మంత్రిపై పరువు నష్టం దావా వేశారు. వివాదం పెద్దది అవుతుండడంతో రంగంలోకి దిగిన టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ రంగంలోకి దిగారు. వివాదాన్ని ఇంతటితో ఆపేయాలని కోరారు. అయినా ఇండస్ట్రీ వైపునుంచి విమర్శలు కొనసాగుతున్నాయి. దీంతో అతిగా స్పందిస్తున్న ఇండస్రీ ్టతీరుపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇండస్ట్రీ పెద్దల అతి కాంగ్రెస్‌ పెద్దలకు ఆగ్రహం తెప్పిస్తోంది. కాంట్రోల్‌ చేయాల్సిన ఇండస్ట్రీ పెద్దలు స్పందించకపోవడం కూడా తెలంగాణ ప్రభుత్వ అసంతృప్తికి కారణమవుతోంది. వ్యాఖ్యలు ఉప సంహరించుకున్న తర్వాత కూడా ఇండస్ట్రీవైపు నుంచి విమర్శలు కొనసాగడం సీఎంకు కోపం తెప్పించింది.సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఇండస్ట్రీ తీరును పలుమార్లు తప్పు పట్టారు. సినిమాలు తీస్తున్న నటీనటులు డ్రగ్స్‌కు అలవాటు కావొద్దని యువతకు ఎందుకు సూచించడం లేదని ప్రశ్నించారు. తర్వాత నంది అవార్డుల స్థానంలో గద్దర అవార్డు ఇస్తామని సీఎం ప్రకటించారు. కానీ, దీనికి అడుగు ముందుకు పడడం లేదు. టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్న ఇండస్ట్రీ ఇతర విషయాలపై మాత్రం స్పందించడం లేదని పేర్కొన్నారు. తాజాగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఇండస్ట్రీ స్పందిస్తున్న తీరుపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీపై సానుకూలంఆ ఉండాల్సిన పని లేదని భావిస్తున్నట్లు తెలిసింది. అతిగా స్పందించడం మాని తటస్తంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిదని కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *