సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో ప్రతినిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతాయి. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి లైకుల కోసం రీల్స్ చేసుకునే వారు పెరిగిపోయారు. ద్విచక్ర వాహనాలపై వింత పోకడలు పోతున్నారు. వాహనాల సైలెన్సర్లు తీసేసి గందరగోళం సృష్టిస్తున్నారు. త్రిబుల్ రైడింగ్ వెళుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణాలు పోతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంతో పాటు నగరంలోకి వచ్చే అన్ని ప్రధానకూడళ్లలో కాకినాడ ఎస్ పి విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసారు.రోడ్డు భద్రత పాటించని వారిని అదుపులోకి తీసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు కౌన్సిలింగ్ నిర్వహించి జరిమానాలు విధిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకు పంపుతున్నారు.