సిరా న్యూస్,ఆదోని;
ఆదోని మార్కెట్ యార్డులో నిన్న అనుకోకుండా కురిసిన వర్షానికి మార్కెట్ యార్డు అధికారుల నిర్లక్ష్యానికి భారీ మొత్తంలో వేరుశనగ ధాన్యం తడిసి రైతులు చాలా వరకు నష్టపోయారు.
మధ్యాహ్నం టెండర్ ప్రక్రియ పూర్తయ్యాక అనుకోకుండా వర్షం రావడంతో ధాన్యం తడవకుండా రైతులు టార్పళ్ల కోసం పరుగులు తీశారు. . అంతలోపు డ్రైనేజ్ పొంగి వేరుశనగ రాశుల్లోకి నీరు చేరుకుని ధాన్యం తడిసి పోయిందని , తడిసిన ధాన్యాన్ని కొనడానికి బయ్యర్లు రైతుల వద్ద క్వింటాలుకు 5 నుండి 10 కేజీల ధాన్యం అదనంగా ఇస్తే తీసుకుంటామని డిమాండ్ చేసారు. రైతులకు తీరని నష్టం కలిగిస్తున్నారని , సరుకు అమ్మినాక నగదు ఇవ్వడానికి వడ్డీ కూడా డిమాండ్ చేస్తున్నారని రైతు వాపోయారు. ఐతే సగం సరకు తూకం చేశాక సరుకు వద్దని రైతుని ఇబ్బంది పెట్టడంతో తప్పని పరిస్థితిలో మార్కెట్ యార్డ్ సిబ్బందికి పిర్యాదు చేసారు. రైతు పిర్యాదు మేరకు కమిషన్ ఎజెంట్ ని పిలిపించి రైతు కు న్యాయం ఎలాంటి తరుగు లేకుండా టెండర్ ధరకే బయ్యర్ నుండి వెంటనే నగదు ఇప్పించి న్యాయం చేసారు.
ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం వలన జరిగిన నష్టమే , డ్రైనేజ్ ఫ్రీగా ఉంటే నీరు బయటికి రావు , ధాన్యం తడిసే అవకాశం ఉండేది కాదని , ఎలాగైనా నష్టపోయిన రైతులకు మార్కెట్ యార్డ్ అధికారులు నష్టం కలగకుండా చూడాలని రైతులు కోరుకుంటున్నారు..