ఇప్పటికే ఐదుసార్లు ఏసీబీ దాడులు
సిరా న్యూస్,బద్వేలు;
బద్వేలు సబ్ రిజిస్టర్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది మొదటినుంచి ఈ కార్యాలయం అవినీతికి నిలయంగా మారింది ఇప్పటికే ఐదుసార్లు ఏసీబీ అధికారులు దాడులు చేసి లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పలువురుపై కేసులు నమోదు చేశారు గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ కార్యాలయం మరింత అవినీతిమయంగా మారింది నకిలీ పత్రాలతో బద్వేలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పలు రిజిస్ట్రేషన్లు జరిగాయి ఇలా జరగడంతోనే నకిలీ పత్రాలు పుట్టుకొస్తున్నాయి వీటికి అడ్డుకట్ట పడకపోవడంతో అడపా దడప నకిలీ పత్రాల తయారీ ముఠా కార్యకలాపాలు సాగిస్తుంది బద్వేలు కేంద్రంగా పెద్ద ఎత్తున నకిలీ పత్రాల తయారీ జరుగుతుంది వీటిని కట్టడి చేయడంలో పోలీస్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ అధికారులు ఎలాంటి చర్యలు చూసుకోవడం లేదు వీరితో పాటు ఎలాంటి అనుమతులు లేని ప్రభుత్వ స్థలాలకు సైతం ఏపీ డి సి ఎల్ అధికారులు విద్యుత్తు సర్వీసులు అక్రమంగా ఇస్తున్నారు ఇదో దందా సాగుతుంది