బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కేతనబోయిన హనుమంతరావు
సిరా న్యూస్,పిడుగురాళ్ల;
దేశ చరిత్రలోనే మొదటిసారిగా భారతదేశము యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు 700 బిలియన్ డాలర్లు చేరటం భారత ఆర్థిక వ్యవస్థకు శుభ పరిమాణం అని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కేతనబోయిన హనుమంతరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరుసగా ఏడు వారాల పెరుగుదల అనంతరం 12.588 మిలియన్ డాలర్లకు విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎగబాకినయి అన్నారు.
చైనా,జపాన్,స్విట్జర్లాండ్ తర్వాత ప్రపంచంలోనే భారతదేశం ఈ ఘనతను సాధించటం భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలిష్టతకు,ఆర్థిక వ్యవస్థ నిలకడకు నిదర్శనం అన్నారు.
ప్రపంచ ఆర్థిక రంగానికి భారతదేశం పెద్దన్న పాత్రను పోషిస్తుంది ఎలాంటి సందేహం లేదు.
ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరించినటువంటి విదేశాంగ విధానం వలనే దేశం ఇంతటి ఘనతను సాధించింది అని ఈ సందర్భంగా కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ పిడుగురాళ్ళ ప్రధాన కార్యదర్శి ఆతులూరి రాము, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.