సిరా న్యూస్,రంగారెడ్డి;
శుక్రవారం రాత్రి మియాపూర్ మెట్రో స్టేషన్ వెనక చిరుత ఆకారంలో అడవి పిల్లి కనిపించడంతో.. అది చిరుతపులే అని భావించి స్థానికులు ఆందోళన చెందారు. పోలీసులూ, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారంతా అక్కడికి వచ్చి స్థానికులను వివరాలు అడిగారు. స్థానికులు తీసిన వీడియోని పరిశీలించారు. వీడియోని చూస్తే, అది చిరుతపులి లాగానే కనిపిస్తోంది. అది అడవి పిల్లి అని నిర్ధారించారు. వన్యప్రాణులకు ఆవాసమయిన అడవులు తగ్గిపోవడం వల్లే ఇలా బయటకు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.