సిరా న్యూస్,కొమురం భీం;
వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బుధవారం 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వాంతులు విరోచనాలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరుతూ విద్యార్థినిల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఐదు రోజులు గడుస్తున్నా ఇంకా విద్యార్థుల ఆరోగ్యం కుదుట పడలేదు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో 13 మంది, ఆసిఫాబాద్ సర్కార్ , ప్రైవేటు దవాఖానాల్లో 15 మంది, మంచిర్యాల లో 6గురు చికిత్స పొందుతుండగా రాత్రి జ్యోతిక, మహాలక్ష్మి అనే ఇద్దరు విద్యార్ధినులను హైదరాబాద్ నిమ్స్ కు రెఫెర్ చేశారు. విద్యార్థుల అనారోగ్యానికి గల కారణాలు, వారి ఆరోగ్యం పరిస్థితుల పై హాస్టల్ సిబ్బంది క్లారిటీ ఇవ్వకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.