JAC Vannoor Swamy: కుల వివక్షతను రూపుమాపండి : ఎస్సీ, ఎస్టీ, జేఏసీ తాలూకా అధ్యక్షులు చెలిమప్ప వన్నూరు స్వామి

సిరాన్యూస్‌, కళ్యాణదుర్గం
కుల వివక్షతను రూపుమాపండి : ఎస్సీ, ఎస్టీ, జేఏసీ తాలూకా అధ్యక్షులు చెలిమప్ప వన్నూరు స్వామి

కుల వివక్షతను రూపుమాపాల‌ని ఎస్సీ ఎస్టీ జేఏసీ తాలూకా అధ్యక్షులు చెలిమప్ప వన్నూరు స్వామి అన్నారు . మంగ‌ళ‌వారం
కళ్యాణదుర్గం ఆర్డీవో ఎస్సీ ఎస్టీ జేఏసీ తాలూకా కమిటీ ఆధ్వ‌ర్యంలో విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈసంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ అంటారనేతనం ఒక దురాచారం ఒక మూడ విశ్వాసం తోటి మానవుని మానవునిగా చూడలేని మూఢవిశ్వాసం అంటరానితనం అనాదిగా సమాజంలో ఉంటూ ఈ నాటికి కూడా కొన్ని సమాజాలలో కొనసాగుతూనే ఉంద‌న్నారు.నేటికీ ఈ కుల వివక్షత చాలా గ్రామాలలో ఉన్న వీటిని అరికట్టడంలో ప్రభుత్వం యంత్రాంగం గాని ప్రజా ప్రతినిధులు గాని కృషి చేయకపోవడంతోనేటికీ కొనసాగుతూనే ఉంద‌న్నారు. వీటిని అరికట్టడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుని గ్రామాల హోటల్లో గాని మంగళ షాప్ లో గాని దళితులకు అందరు అలాగే గౌరవించే విధంగా చర్యలు తీసుకోవాలని కళ్యాణదుర్గం ఆర్డీవో ఎస్సీ ఎస్టీ జేఏసీ తాలూకా కమిటీ ఆధ్వ‌ర్యంలో విన‌తి ప‌త్రం అంద‌జేశామ‌న్నారు.ఈ మార్పు కోసం ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో దళితులలోచైతన్య కార్యక్రమాల చేపట్టబోతున్నమని తెలియ‌జేశారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ జేఏసీ తాలూకా నాయ‌కులు చనమల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *