సిరా న్యూస్,ఆచంట;
ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలం రామన్నపాలెం రచ్చబండ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ సమక్షంలో50మంది సభ్యులు వైసిపీనుండి టీడీపీలో చేరారు. వారందరికి పితాని పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.పితాని మాట్లాడుతూ వచ్చే ప్రభుత్వం మనదే తప్పనిసరిగా మీ అందరి సమస్యలు తీర్చి న్యాయం చేస్తాం మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత మాదని రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ సరి చేస్తాము రానున్నరోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి ఎండగడదామని అన్నారు.