సిరాన్యూస్, అదిలాబాద్
ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘ జిల్లా అధ్యక్షుడిగా హింగోలి సత్యనారాయణ
ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ఆదిలాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. సంఘ అధ్యక్షుడిగా హింగోలి.సత్యనారాయణ, కార్యదర్శిగా సూరజ్ సింగ్, ఉపాధక్షుడిగా కే వీ, కేశవులు, సంయుక్త కార్యదర్శిగా కే. వెంకటేశ్వర్లు,మహిళ కార్యదర్శిగా ఏ. సరితారాణి, కోశాధికారిగా రాథోడ్ శ్రావణ్, మెంబర్ల్ గా యం స్వామి,అనిల్ కుమార్ లు ఏకగ్రివంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా జే.గణేష్ కుమార్,బి. శంకర్, ఎన్నికల పర్యవేక్షకులుగా శేక్ మోహసిన్ వ్యవహరించారు. నూతన కార్యవర్గాన్ని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సి.రవిందర్ కుమార్, ప్రిన్సిపల్ యస్. సూర్యప్రకాష్, ప్రిన్సిపల్ కే. సునిల్, తెలంగాణ ప్రభుత్వ జూనియర్ జనరల్ సెక్రటరీ బలరాం జాదవ్ తదితరులు అభినందించారు .