Kalvasri Rampur: కాల్వశ్రీరాంపూర్‌లో కుక్కలకు సోకుతున్న వింత వ్యాధి

సిరాన్యూస్‌, కాల్వశ్రీరాంపూర్
కాల్వశ్రీరాంపూర్‌లో కుక్కలకు సోకుతున్న వింత వ్యాధి

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో వీధి కుక్కలకు వింత రోగం సోకింది. ఈ వ్యాధి సోకిన కుక్క‌ల చ‌ర్మం మొత్తం ఉండిపోయి భ‌యంక‌రంగా క‌నిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఒక‌టి రెండు కుక్క‌ల‌కు మాత్ర‌మే ఈ వ్యాధి సోక‌గా క్ర‌మంగా వాటి సంఖ్య పెరుగుతోంది. దీంతో వాటిని చూసి జనం భ‌యపతున్నారు.అది ఏం వ్యాధి అని పిల్లలు సైతం బయటికి రావాలంటే భ‌యపడుతున్నారు. అధికారులు స్పందించి కుక్క‌ల‌ను ఉరి నుంచి త‌రిమేయాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *