kalwa Srirampur: కాల్వ శ్రీరాంపూర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

సిరాన్యూస్‌,కాల్వ శ్రీరాంపూర్‌
కాల్వ శ్రీరాంపూర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. అనంత‌రం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ గాంధీజీ చేపట్టినటువంటి కార్యక్రమాల వల్లనే స్వాతంత్రం తెచ్చుకున్నామని , నిరంతరం గాంధీజీ ఆశయాలను కొనసాగించాలని అన్నారు. దేశంలో ఎల్లప్పుడు శాంతి భద్రతలు కాపాడుకోవాలని గాంధీజీ చెప్పారని వారు అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్ , మండల అధ్యక్షులు గాజనవేనా సదయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు అల్లంల దేవేందర్ యాదవ్, మాజీ సర్పంచ్ మాదాసి సతీష్ ,మాజీ సర్పంచ్ శ్రీపతి మొగిలియ్య గౌడ్.యూత్ నాయకులు రానవేన క్రాంతి , బీసీ సెల్ సబ్బాని రాజమల్లు, మైనార్టీ సెల్ ఎండి రహీం, నాయకులు రానావేనా శ్రీనువాస్ , ఎనిగంటి రవి, తాండ్ర సురేష్ కలవల శ్యామ్ జిన్నా రామచంద్ర రెడ్డి, రాజేందర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *