సిరాన్యూస్, కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గంలో ఘనంగా శ్రీ పూర్ణానంద స్వామి జన్మదిన వేడుకలు
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట ఏరియాలో ఉన్న శ్రీ పూర్ణానంద స్వామి ఆలయంలో స్వామివారి జన్మదిన వేడుకలను శనివారం భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు, పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, అష్టోత్తర పూజలు, కుంకుమార్చన వంటి పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వినియోగం చేశారు.