సిరాన్యూస్, కళ్యాణదుర్గం
కంబదూర్‌లో కార్తీక మాసం పూజలు
కంబదూరు మల్లేశ్వర ఆలయంలో కార్తిక మాస పూజలు శివపార్వతులకు అత్యంత ప్రీతికరమైన కార్తిక మాసం శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మాసాన్ని హిందువులు పరమ పవిత్రమైన మానంగా భావిస్తుంటారు. కార్తిక మాసాన్ని పురస్కరించు కుని కంబదూరు మల్లేశ్వర స్వామి ఆలయంలో నేటినుంచి స్వామి వారికి నెల రోజుల పాటు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు మీడియాకు తెలియజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.