సిర్యానూస్, శంకరపట్నం:
అమ్మవారి దయ అందరిపై ఉండాలి: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
* శంకరపట్నంలో ఘనంగా శ్రీ రేణుకాదేవి జమదగ్ని కళ్యాణ మహోత్సవం
రేణుకాదేవి ఎల్లమ్మతల్లి అమ్మవారి దయ అందరిపై ఉండాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం కేశవపట్నం మండల కేంద్రంలో శ్రీ రేణుక దేవి జమదగ్ని కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేకంగా హాజరై పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనకి శ్రీ రేణుకాదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్, శంకరపట్నం గ్రామశాఖ అధ్యక్షుడు మొలంగూరి సదానందం గౌడ్ , ఆలయ ధర్మకర్తలు స్వాగతం పలికి శాలువా కప్పి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మానకొండూర్ ఎమ్మల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రేణుకాదేవి జమదగ్ని కళ్యాణ మహోత్సవ జాతరకి వచ్చినటువంటి భక్తులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రేణుకాదేవి ఎల్లమ్మతల్లి అమ్మవారి దయ అందరికీ ఉండాలని రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని, రాబోయే రోజుల్లో వర్షాలు బాగా పడి రైతులు మంచి పంటలు పాండించలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చిన భక్తులు జాగ్రత్తలు వహిస్తూ ఘనంగా జరుకోవాలని కోరారు. గ్రామదేవతల ఆలయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గీతపారిశ్రామిక సహకార సంఘం సభ్యులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.