సిరా న్యూస్,హైదరాబాద్;
కులగణన కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీపీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో చేపట్టబోయే ఈ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలవబోతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త కీలకంగా తీసుకోవాలి. నవంబర్ 2న 33 జిల్లాలో కులగణనపై డీసీసీ అధ్యక్షులు సమావేశాలు ఏర్పాటు చేసి పెద్దఎత్తున ప్రజల్లోకి తీస్కెళ్లాలి. విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల ఘణన పై ఎలాంటి అనుమానాలు ఉన్న గాంధీభవన్ లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమాచారం ఇస్తామని అన్నారు.