సిరా న్యూస్,హైదరాబాద్;
కొమురం భీం జిల్లా,జైనూరు మండలం, జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక సాయిశ్రద్ధ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం అందించారు. ఎంబీబీఎస్ లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్ధిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్న సాయి శ్రద్ధ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే సీఎం స్పందించారు. డాక్టర్ కావాలన్న ఆ అమ్మాయి కల నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చి ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా సాయిశ్రద్ద, కుటుంబ సభ్యులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.