తలసాని
సిరా న్యూస్,సికింద్రాబాద్..
ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ విధ్వంసం నేపథ్యంలో విగ్రహ ప్రతిష్ఠ, శాంతి హోమాలు కుంభాభిషేకం జరిపించాలని వేద పండితులు సలహా ఇచ్చినట్లు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శాస్త్రోక్తంగా అమ్మవారి విగ్రహాన్ని పున ప్రతిష్టించిన అనంతరం కుంభాభిషేకం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. విగ్రహ పున ప్రతిష్ట అనంతరం శివశక్తులు జోగినిలు పటాలు వేసే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి ఇంటి నుండి బోనాలు తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్థానికంగా ఉండే ప్రజలు కుటుంబాల పరిస్థితి మెరుగవ్వాలంటే శాస్త్రవేత్తంగా జరగాల్సిన కార్యక్రమాలు వెను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ఆలయ విగ్రహం పునప్రతిష్టించి సాధారణ పరిస్థితులను తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.త్వరలోనే ఆలయంలో శాంతి హొమాలతో పాటు కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించాలన్న నిర్ణయం మంచిదని వేద పండితులు తెలిపారు.