సిరా న్యూస్;
కర్నాటకలో వెలుగు చూసిన భాషా వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కర్నాటకలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి అన్ని వాణిజ్య సంస్థలు, దుకాణాల నామఫలకాల్లో 60శాతం కన్నడ అక్షరాలే ఉండాలని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ఆదేశాలు జారీ చేశారు. 60 శాతం కన్నడ అక్షరాలు, 40 శాతం ఇతర భాషాల అక్షరాలతో నామఫలకాలు ఉండేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్డినెన్స్ సంబంధించిన నియమాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 28లోగా అన్ని కంపెనీలు, సంస్థలు, ఇతర దుకాణాలు తమ నేమ్‌ప్లేట్‌లను మార్చుకోవాలని సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. కన్నడ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాపారులంతా వీటిని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ’60 శాతం కన్నడ’ పేరుతో ఓ ఉద్యమం తెరమీదికి వచ్చింది. కర్నాటకలో వ్యాపారాలు నిర్వహించేవారు.. దుకాణాల ముందు ఇంగ్లీష్‌లో సైన్ బోర్డుల ఏర్పాటు చేయడంతో కన్నడ భాష అంతరించే ప్రమాదం ఉందంటూ కర్నాటక రక్షణ వేదిక ఆందోళనలకు దిగింది. వాణిజ్య వ్యాపార సంస్థల సైన్ బోర్డులపై ’60శాతం కన్నడ’ అక్షరాలే ఉండాలన్న నిబంధనను అమలు చేయాలని పట్టుబడుతోంది.కర్ణాటకలో భాషా వివాదం మరింత ముదిరింది. దుకాణాదారులు, ఇతర వ్యాపార సంస్థల సైన్ బోర్డులలో 60 శాతం వరకూ కన్నడ భాషనే వినియోగించాలన్న ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తోంది. కర్నాటక రక్షణ వేదిక సభ్యుల దాడులు పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి. అటు.. ఆందోళనకారుల తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేదిలేదంటూ వార్నింగ్ ఇచ్చింది.కర్ణాటకలో వెలుగు చూసిన భాషా వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ’60 శాతం కన్నడ’ పేరుతో ఓ ఉద్యమం తెరమీదికి వచ్చింది. కర్నాటకలో వ్యాపారాలు నిర్వహించేవారు.. దుకాణాల ముందు ఇంగ్లీష్‌లో సైన్ బోర్డుల ఏర్పాటు చేయడంతో కన్నడ భాష అంతరించే ప్రమాదం ఉందంటూ కర్నాటక రక్షణ వేదిక ఆందోళనలకు దిగింది. వాణిజ్య వ్యాపార సంస్థల సైన్ బోర్డులపై ’60శాతం కన్నడ’ అక్షరాలే ఉండాలన్న నిబంధనను అమలు చేయాలని పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే.. నేమ్ బోర్డుల విషయంలో టీఏ నారాయణగౌడ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. అయితే.. బెంగళూరులోకర్నాటక రక్షణ వేదిక నిర్వహించిన ర్యాలీలు ఉద్రిక్తతకు దారితీశాయి. కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌తోపాటు పలు ప్రాంతాల్లో రెచ్చిపోయిన ఆందోళనకారులు.. హోటళ్లు, దుకాణాలపై ఆంగ్లంలో ఉన్న సైన్‌బోర్డులను తొలగించి విధ్వంసం సృష్టించారు. ఈ ఏడాది అక్టోబర్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు కన్నడవాదం అనే తేనెతుట్టను మరోసారి కదిపాయి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కన్నడ భాషను నేర్చుకోవాలని, అందరూ కన్నడిగులే అవ్వాలని తేల్చి చెప్పారు సిద్దరామయ్య. అంతకు ముందే కీలక ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరు సిటీలో బిజినెస్ చేస్తున్న వాళ్లంతా నేమ్ బోర్డులపై కచ్చితంగా కన్నడ భాషలో రాయాలని, అందుకు కొంత ఖాళీ ఉంచాలని తేల్చి చెప్పింది ప్రభుత్వం. బెంగళూరు మున్సిపాలిటీ అధికారులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆర్డర్ పాస్ చేసింది. బిజినెస్‌లకు సంబంధించిన నేమ్ బోర్డులలో 60% మేర కన్నడనే కనిపించాలనేది ఈ ఉత్తర్వులలో సారాంశం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా సిటీ అంతటా ఇది అమలవ్వాలని రూల్ పెట్టారు. కన్నడవాదులంతా ఈ నిబంధన పెట్టినందుకు ప్రభుత్వాన్ని పొగిడారు. కానీ…రూల్ పెట్టినంత వరకూ బాగానే ఉంది. అమలు చేయడంలోనే చాలా ఆలస్యం జరుగుతోంది. ఇప్పటికీ చాలా బోర్డులపై ఇంగ్లీష్ కనిపిస్తోంది. ఇది చూసి అసహనానికి గురైన కన్నడ సంఘాలు క్రమంగా ఆందోళనలు ఉద్ధృతం చేశాయి.